సనాతన ధర్మం అంటే ఏమిటి?
ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మానవజీవనానికి అనువైన సమశీతోష్ణస్థితి , అందమైన ప్రకృతి మనకే సొంతం. ప్రపంచంలో ఒక్కోదేశానికి ఒక్కొక ప్రాబ్లెమ్ వుంది. ఒక దేశానికి విపరీతమైన ఎండలు, మరొక దేశానికి విపరీతమైన గాలివానలు, ఇంకొక దేశానికి విపరీతమైన చలిగాలులు, మైనస్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటుంది. మరికొన్ని దేశాలకు వారి జనాబాకు తగ్గట్టు ఖనిజ సంపద ఉండదు. ఈ ప్రతికూల పరిస్థితులలో ఆయా దేశాలలో జనజీవనానికి నానాపాట్లు పడుతుంటారు.
మన భారతదేశంలో జనజీవనానికి సరిపోయే సమతుల ఉష్ణోగ్రతలు,నదులు, మానవ మనుగడకు ఉపయోగపడే ఖనిజ సంపద మన భారత దేశంలో ఉందనడంలో అతిశయోక్తి లేదు. మన భరత్ భూమిలో సకాలానికి వర్షాలు కురుస్తాయి, బంగారం లాంటి పంటలు పండించడానికి సారవంతమైన భూములు వున్నాయి.
ఆ రోజుల్లో మనుషులు ప్రకృతి గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు అని , వారు పెట్టిన నియమాలను ఒక్కసారి గమనిస్తే అర్థం అవుతుంది.
ఆ కాలంలో మన పూర్వికులు పచ్చని ప్రకృతి వొడిలో జీవించేవాళ్ళు కాబట్టి, ప్రకృతి శాంతంగా ఉంటేనే తాము ప్రశాంతంగా ఉండగలమని బావించారు.
అలా భూమిని, సూర్యుణ్ణి, ఆకాశాన్ని, మేఘాల్ని, చెట్లను, వర్షాన్ని కృతజ్ఞతా భావంతో దేవతలుగా పూజించారు. అది మెల్లగా ప్రకృతి ఆరాధనగా మారింది.
సనాతన ధర్మం గురించి చెప్తా అని ఈ సోది ఏంటని అనుకుంటున్నారా!
అక్కడికే వొస్తున్నా…
ఈ విషయాలు మన సనాతన ధర్మం నెలకొల్పటానికి దోహదం చేశాయని చెప్పే చిన్న ఉద్దేశం.
సనాతన ధర్మం అంటే ఏమిటి?
అనేక లక్షల సంవత్సరాల క్రితమే మన పూర్వికులు మనిషి చావు పుట్టుక గురించి, ఆత్మా-పరమాత్మల్ని గురించి, మరణానంతర పరిణామాల్ని గురించి ప్రశ్నిచుకొని సమాధానాలు వెతుకొన్నారు.
ఆ దిశలో అనేక మంది ఋషులు , మునులు, జ్ఞానులు, నిరంతరం సత్యాన్వేషణకై తపస్సు చేశారు. వాళ్ళు తపస్సమాధిలో వున్నప్పుడు అత్యున్నత సత్యాన్ని, ధర్మాన్ని, వేదం వాక్యాలు రూపంలో దర్శించారు. తపస్సమాధిలో ఉండగా వాళ్లకు లభించిన జ్ఞానాన్నే వేదాలు అన్నారు.వాళ్ళు తపస్సమాధిలో వున్నప్పుడు అత్యున్నత సత్యాన్ని, ధర్మాన్ని, వేద వాక్యాల రూపంలో దర్శించారు.
తపస్సమాధిలో ఉండగా వాళ్లకు లభించిన జ్ఞానాన్నే వేదాలు అన్నారు. వేదం అంటే జ్ఞానం అని అర్థం. వాళ్లకు వేదాలు పరమాత్ముడి వాణి గా వినిపించాయి కాబట్టి వాటిని శ్రుతులు అన్నారు.
వేదాల ద్వారా లభించిన జ్ఞానంతో మన ఋషులు ఎంతో కృషి చేసి కొన్ని శాశ్విత సిద్ధాంతాలుగా ప్రతిపాదించారు. వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు విశ్వమంతటికి, అన్ని యుగాలల్లో ను వర్తిస్తాయి.
మానవులు ఏ ఏ దశల్లో ఎటువంటి నియమాలు పాటించాలి, కుటుంబం, సమాజం, ప్రకృతి మరియు దేశాల పట్ల వాళ్ళ భాద్యత ఏమిటి? అన్న విషయాల గురించి ఆలోచించి , వీటన్నిటికీ దారి చూపించగల అద్భుత జీవనవిధానాన్ని రూపొందించారు.
సమస్త జగత్తును క్షేమంగా వుంచగల ఈ శాశ్విత సూత్రాలే ధర్మాన్నినికి ఆధారంగా నిలిచాయి. మానవులకు మంచి చేయగల శక్తి ఈ ధర్మానికి వుంది కాబట్టి దీనిని మానవధర్మం అన్నారు.
మనిషి యొక్క శాశ్విత సిద్ధాంతాల మీద ఆధారపడి వుంది గనుక ఈ ధర్మాన్ని సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మాన్ని దైవధర్మం అని కూడా పిలుస్తారు.మన దేశాన్ని హిందూ దేశం అని పిలవటం చేత మనం అనుసరించే ఈ సనాతన ధర్మాన్ని హిందూధర్మం అని అన్నారు. మానవ జాతి చరిత్రను అన్ని వేళలా కాపాడుతూ వస్తుంది ఈ సనాతన ధర్మం.
సనాతన ధర్మం ఏం చెప్తుంది , అందులో ఏ ఏ లక్షణాలు ఉంటాయి, అనే విషయాల గురించి తర్వాత ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఈ ఆర్టికల్ గురించి మీ స్పందనను కామెంట్ల రూపం లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మీయొక్క సలహాలను సందేహాలను మాతో పంచుకోండి. మెరుగైన మరియు ఉన్నతమైన సమాజం కోసం మనవంతు ప్రయత్నం చేద్దాం.
ధన్యవాదాలు
దశావతారాలు సైన్స్https://yuvataram.com/vishnu-dashavatar-vs-science/ కి సంబంధం ఏమిటి?