Health secrets of gorintaku

http://yuvataram.com/

గోరింటాకు ఉపయోగాలు.

గోరింటాకు కేవలం అందం కోసం పెట్టుకోవడం కాదు దాని వేణుకు ఉన్న సైన్స్ కూడా తెలుసుకోండి . . .

సంవత్సరం మొత్తంలో మన ఆడవారు గోరింటాకు ముఖ్యంగా మూడు మాసాల్లో తప్పనిసరిగా పెట్టుకునే సంప్రదాయం ఉంది .

yuvataram.com

1. ఆషాడమాసంలో ఒకసారి,

2. భాద్రపదమాసం మాధ్యమంలో ఉండ్రాళ్ళతద్దికి ఒకసారి ,

3. ఆశ్వయుజ మాసం లో అట్లతద్దికి ఒకసారి తప్పకుండా పెట్టుకుంటారు.

గోరింటాకును సంస్కృతంలో నఖరంజని అని అంటారు. నఖరంజని అంటే గోళ్లకురంగు కలిగించేది అని అర్థం. గోరింటాకు అనే తెలుగు పేరు కూడా ఇదే అర్థాన్నిస్తుంది.

గోరింట అంటే గో రు+అంటు అని అర్థం.

గోరింటాకును చేతి వేళ్ళకు, గోళ్ళకు, అర చేతులకు, పాదాలకు, అరి పాదాలకు, కాళీ గోళ్ళకు, కొందరు నుదిటి మీద బొట్టు పెట్టుకునే చోట పెట్టుకుంటారు. ఇన్ని చోట్ల పెట్టుకునేది అయినా గోర్లకు పెట్టుకునేది గానే గుర్తిస్తారు.

మన తెలుగు రాష్ట్రాలలో ఈ గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి ప్రేమించే భర్త వస్తాడు అని ఒక నానుడి కూడా ఉంది. నిజానికి ఈ గోరింటాకు ఆడవారి అందాన్ని మరింత పెంచడంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణిగా పని చేస్తుంది . కాబట్టి మన పెద్దలు ఈ ఆకును పెట్టుకునే సాంప్రదాయాన్ని పెట్టినారు.

yuvataram.com

పూర్వకాలం నుండి మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఆడవారు ఇంటి పని, వంట పని అలాగే వ్యవసాయం లోనూ ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు పనులు చేయడంలో తరచు నీళ్లు వాడుతూ ఉండాలి. చమ్మలో, బురదలో తిరుగుతూ ఉండాలి. ఈ పనుల వల్ల వాళ్ల చేతులలో మన్ను, దుమ్ము, రోగకారక క్రిములు చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్ళ వేళ్ళ సందులలో కూడా చర్మం పగిలి చెడుతుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వాటిని అంటిపెట్టుకుని ఉండే విష క్రిములు నశిస్తాయి. అవి పిప్పి గోళ్లు కాకుండా కాపాడుతుంది. గోరింటాకు వల్ల కాళ్ళ వేళ్ల సందుల్లో పాడు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.

గోరింట చెట్టు మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. గోరింటాకు చెట్టు ఆకులు, పట్ట, పువ్వులు, గింజలు అన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. గోరింటాకులో ఒక విధమైన చిరువిషం ఉంటుంది. ఇందులో “హెన్నా టానిస్ యాసిడ్” ఉంటుంది. అందుకనే దీని రుచి ఒక రకమైన చేదును కలిగిస్తుంది.

గోరింట పువ్వులతో అత్తరు, సువాసన నూనె తయారు చేస్తారు. ఈ పువ్వుల నుండి బట్టీ పట్టిన నీటిని యూదులు స్నానానికి ఉపయోగించే వారు. గోరింట పువ్వులతో నింపిన గుడ్డ సంచిని తలగడగా అంటే దిండుగా పెట్టుకుంటే నిద్ర త్వరగా వస్తుంది.

ఆకునూరినా ముద్దలో నిమ్మరసం కలిపి అరికాళ్లకు పట్టిస్తే కాళ్ళ మంటలు మొదలగునా బాధలు తగ్గుతాయి. గోరింటాకులు నూరిన ముద్దలో నూని తెల్లగుగ్గీలము కలిపి నుదుటికి పెట్టుకుంటే తలనొప్పులు తగ్గుతాయి. ఈ మందును మశూచికము మొదలైన అమ్మవార్లు కనిపించిన వాళ్ళ పాదాలకు పట్టిస్తే వాళ్ళ కళ్ళల్లో అమ్మవారు పోయదని అంటారు.

గోరింట నూరిన గుజ్జులో నీలిమందు వేసి వెంట్రుకలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగానూ, వెంట్రుకలు బాగా పెరగడానికి తోడ్పడుతుంది. అలాగే గోరింటాకు రసం కొబ్బరి నూనెలో కలిపి తలకు మర్దన చేస్తే జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకుల నుండి తయారు చేసిన ముద్ద గాయాలను కురుపులను మాన్పుతుంది.

ఈ ఆకుల కషాయంతో కాపడం పెడితే బెణుకు నొప్పులు, వాపులు తగ్గుతాయి. పై విషయాల వల్ల గోరింటాకు గొప్ప ఔషధ గుణాలు గల మొక్కగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇది చర్మ రోగాలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది .ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవడం మోటుగా అనిపిస్తుంది.

గోళ్ళకి కృత్రిమమైన రంగు వేసుకుంటున్నారు. రసాయనిక పదార్థాలతో తయారు చేసినది వేసుకోవడం హానికరం, దానికంటే గోరింటాకు అన్నివిధాలా ప్రశస్తమైనది. రసాయనిక పదార్థాలతో తయారు చేయబడిన బొట్టు బిళ్ళలు, బొట్టు పెట్టుకోవడం వల్ల అలర్జీ, కురుపులు వస్తున్నాయి ఈ కురుపులు వచ్చిన చోట గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలర్జీ మంటలు తగ్గుతాయి.

గోరింటాకు ప్రాముఖ్యత హిందువుల కంటే ముస్లిం ఆడవారు ఎక్కువగా గుర్తించి గోరింటాకు చెట్టును తమ పెరటిచెట్టుగా పెంచుకుంటూ నెలకొకసారి తప్పకుండా గోరింటాకును పెట్టు కుంటారు. స్త్రీ సాన్నిహిత్యాన్ని కోరుతుందని చెప్పబడే గోరింటాకు స్త్రీలకు చేసే మేలు మరువరానిది. కాబట్టి మన పెద్దలు గ్రీష్మ ఋతువుకు చెందిన ఆషాడమాసము వర్షఋతువుకు స్వాగతం చెప్పే మాసం.

వర్షఋతువుకు చెందిన భాద్రపదమాసంలో ఉండ్రాళ్ళతద్ది నడి-వర్షాకాలపు పండగ, శరదృతువు కు చెందిన అశ్వయుజ మాస మాధ్యమంలో వచ్చే అట్లతద్ది చివరి పండుగ.

ఈ మూడు సందర్భాల్లో గోరింటాకు పెట్టుకుని తమ ఆరోగ్యం, అందం కాపాడుకునే ఆచారం ఇట్లా పండుగల కార్య విధానంలో మన పెద్దలు మేళవించి చెప్పినారు.

Back To Top