హల్దీరామ్

హల్దీరామ్ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. మన తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా దేశంలోనే అత్యంత నాణ్యమయిన ఉత్పత్తులతో మరియు అందరి మన్ననల తో ముందుకు దూసుకుపోతున్న హల్దీరామ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు హల్దీరామ్ పెరు ఎలా వొచ్చిందో తెలుసా మీకు?

అది తెలియాలి అంటే ఈ కథ వినితీరాల్సిందే….

రాజస్థాన్ లోని బికనెర్ లో గంగా బిషల్ అగర్వాల్ అనే వ్యక్తి కారప్పూస తయారు చేసి అమ్మేవారు, మంచి రుచిగా ఉండటం తో అందరూ ఇష్టంగా కొని తినేవారు. ఆయనను అందరూ హల్దీరామ్ గా పిలిచేవారు ముద్దుగా. ఆయన శరీర ఛాయ పసుపు రంగులో ఉండటం తో ( పసుపు ని హింది లో హల్దీ అంటారు) ముద్దుగా హల్దీరామ్ గా పిలిచేవారు.

ఆయన మనువాలు తాత పేరునే బ్రాండుగా మలిచి ప్రపంచానికి పరిచయం చేసారు. అది ఇప్పుడు దేశ విదేశాల్లో
మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం హల్దీరామ్ వారసుల వ్యాపారం విలువ అక్షరాల 25 వేల కోట్లు(25000 కొట్లు).

నాగపూర్ లోని 12 ఫ్యాక్టరీ లలో హల్దీరామ్ స్వీట్స్ మరియు హాట్స్ తయారవుతాయి. 400 రకాల ఉత్పత్తులతో 100 దేశాల కు ఎగుమతి చేస్తున్నారు. ఈ కంపిని సంవత్సరానికి లక్ష టన్నుల హాట్ ఉత్పత్తి చేస్తోంది.

హల్దీరామ్ బ్రాండ్ సృష్టికర్తల్లో ప్రధాన మైన వ్యక్తి శివ కిషన్ అగర్వాల్, ఇప్పుడు ఈయన వయసు 79. ఈయన గంగా బిషన్ అగర్వాల్(హల్దీరామ్) మనువడు. . ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని శివకీషన్ అగర్వాల్ కొడుకులు, మనువాలు డైరెక్టర్లు గా వుంటూ చూసుకుంటున్నారు .

ఇదండీ హల్దీరామ్ కత.

మీకు ఇంకా ఏదైనా విషయం తెలిసి ఉంటే కామెంట్ చెయ్యండి.

Back To Top